News

షర్మిల పెళ్లిపై వివాదం...


మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ప్రతిపాదిత వివాహంపై వివాదం రేగింది. షర్మిల తన దీర్ఘకాలిక మిత్రుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంపై వి. మహేంద్రన్ అనే ఉద్యమకారుడు అభ్యంతరం చేశారు. బ్రిటిష్ జాతీయుడైన డెస్మండ్ కొటిన్హో, ఇరోమ్ షర్మిల పెళ్ళి ప్రతిపాదనపై కొడైకెనాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లయితే, వారు కొడైకెనాల్‌లోనే శాశ్వతంగా స్థిరపడతారని, అది స్థానికుల ప్రయోజనాలకు మంచిది కాదని, ఈ ప్రాంతం భద్రతకు కూడా ముప్పేనని ఆరోపించారు. కొటిన్హో ప్రపంచవ్యాప్త కార్యకలాపాలతో సంబంధంగల వెబ్‌సైట్‌కు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారని, ఆయనతోపాటు షర్మిల కూడా కొడైకెనాల్‌లో స్థిరపడితే, ఈ కొండ ప్రాంతంలో శాంతిభద్రతలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో షర్మిల స్థాపించిన పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. అనంతరం ఆమె, కౌటిన్హో కలిసి కొడైకెనాల్‌లో నివసిస్తున్నారు.